భాషాశాస్త్రానికి విరుద్ధముగా

+2

ఎదో ఒక title

భాషాశాస్త్రం అనేది భాషల గురించి విశ్లేషణ మరియు అధ్యయనం. తెలుగు జెట్పంక్ సమూహంలోని ఎంతో మందికి భాషాశాస్త్రం అంటే ఆసక్తి. కానీ ఈ ఆసక్తి నాలో లేదు. ఎందుకంటారా? ఎందుకంటే నా ఉద్దేశంలో ఇది పనికిరాని విద్య. భాష గురించి నేర్చుకోవడం అన్నది తప్పని నేను చెప్పను. భాషల గురించి మనం దీని ద్వారా తెలుసుకోవడం మంచిదే, కానీ అందువలన భాషలకి జరిగిన మేలు ఏమిటి? మీరే ఒక్క సారి ఆలోచించుకోండి. ఆకలిగా వున్న మనిషికి చెంచా గురించి చెప్తే కడుపు నిండిపోదు. ఆ కడుపులోకి తిండి పడాలి. ఇక్కడ ఏమి తిండి పడుతోంది? మన భాషల్లో ఇందువలన వచ్చిన స్పష్టమైన అభివృద్ధి ఏది? నాకైతే కనిపించట్లేదే! ఎన్నో పెద్ద పెద్ద పదాలతో ఏదో పునర్నిర్మాణం చేసి భాషనీ, సంస్కృతినీ, ఉద్ధరించేసినట్టుగా ఈ విద్యలో ప్రముఖులు భావిస్తారేమో. ఈ మూర్ఖత్వానికి వాస్తవానితో ఎటువంటి సంబంధం లేదు. ఇలాంటి ఎన్ని ప్రయాసలు ఇంకా ప్రయత్నాలు వచ్చినా, భాష మటుకూ మాట్లాడేవారికి కావలసినట్టు ఇంకా వాళ్ళకి కావలసినప్పుడు మారుతూ ఉంటుంది. ఈ విషయాన్నీ ఒప్పేసుకొని భాషాశాస్త్ర ప్రేమికులు ఇంతే ఉత్సాహానితో వేరే ప్రయోగాలు చేపట్టారంటే ప్రపంచం ఏ విధముగా మారుతుందో ఎవరు చెప్పగలరు?

2 Comments
+1
Level 65
Apr 23, 2024
mi titleayya
+1
Level 65
Apr 30, 2024
https://www.jetpunk.com/users/helloisgone/blog/blog-entry-7

నా జవాబు.