చెట్లు పాతడంలో కొత్త సహకారి

+3

డిసెంబరు ౨౦౨౨ నవీకరణ: మా సైట్లో పాతిన చెట్ల సంఖ్య నిరంతరంగా నవీకరించడం ఇంక చెయ్యం. మా దానాలు ఇచ్చేటప్పుడు సంఖ్య నవీకరణ జరుగుతుంది, అంటే సుమారు ప్రతి సంవత్సరం. ఇప్పటి వరకు, మా దానాలవలన Trees for the Future ౫,౦౦,౮౪౦ చెట్లు పాతారు, అలాగే Arbor Day Foundation ౧౫,౦౭౮ పాతారు.

--------------------

Trees for the Future తో ఇప్పుడు సహకారం ప్రారంబిస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నాం. వాళ్ళ లక్ష్యం ఏమిటంటే ఆఫ్రికాలో ప్రజలకు పెరటి తోటలు పాతడానికి సహాయం ఇవ్వడం. ఈ పెరటి తోటలేమో బొగ్గుపులుసు వాయువు పీల్చుకోవడమే కాకుండా, వాటిని పెంచే రైతులకు అమూల్యమైన తిండినీ అడవి ఉత్పత్తలనూ అందిస్తాయి.

వాళ్ళ పద్ధతి గురించి ఇక్కడ చదవచ్చు, అలాగే మా స్పాన్సర్ పేజీ ఇక్కడ చూడచ్చు (రెండూ ఆంగ్లంలో ఉన్నాయి).

Trees for the Future ఆఫ్రికాలో స్థానిక రైతుల తో పనిచేస్తున్నందుకు మా ముందు సహకార సంస్థ కంటే వాళ్ళకు చెట్లు పాతడం చాలా తక్కువ ఖర్చు, అలాగే మేము పాతిన చెట్లు హటాత్తుగా చాలా ఎక్కువ అయ్యాయి.

ఇదివరకట్లాగానే, JetPunkలో మేము మా రెవెన్యూలో ౫% చెట్లు పాతడానికి దానంగా ఇవ్వాలని కట్టుబడున్నాం. దీన్ని సాధ్యంగా చేసినందుకు ఈ సైట్ వాడేవాళ్ళందరికి ధన్యవాదం.

+1
Level 65
Jun 19, 2023
Nenu ithi chesthunanu! Ithi oka translation ani cheppu, ithi 2019 nunchi ani cheppu.
+2
Level 76
Jun 19, 2023
Blurblo ceppa, malli ceppana?
+1
Level 65
Dec 8, 2023
malli
+1
Level 15
Apr 30, 2024
వ్యాసం బాగుంది